బీఆర్ఎస్​కు ఇవే చివరి ఎన్నికలు : కూనంనేని సాంబశివరావు

బీఆర్ఎస్​కు ఇవే చివరి ఎన్నికలు : కూనంనేని సాంబశివరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : బీఆర్ఎస్​కు ఇవే చివరి ఎన్నికలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్​ఎస్​ పదేండ్ల కాలంలో రాష్ట్రాన్ని దోచుకుందని విమర్శించారు. సింగరేణికి రావాల్సిన బకాయిలను ఇవ్వకుండా బీఆర్ఎస్​ కంపెనీని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.

మతాలు, కులాల పేర ప్రజల మధ్య చిచ్చు పెడ్తున్న బీజేపీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్​ఎస్​ పార్టీలు ప్రజలను తమ మాయ మాటలతో మరోసారి మోసం చేసేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. సీపీఐ, సీపీఎం, టీజేఎస్​ బలపర్చిన ఖమ్మం కాంగ్రెస్​ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్​, సీపీఐ, సీపీఎం జిల్లా నాయకులు సాబీర్ పాషా, అన్నవరపు కనకయ్య, నాగ సీతారాములు, కోనేరు సత్యనారాయణ, చంద్రిగిరి శ్రీనివాసరావు, లగడపాటి రమేశ్, అన్నవరపు సత్యనారాయణ, లిక్కి బాలరాజు పాల్గొన్నారు.