కొత్తపల్లి, వెలుగు: క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని, యువకులు క్రీడాకారులుగా ఎదగాలని జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం ఆకాంక్షించారు. కొత్తపల్లి పట్టణ కేంద్రంలోని బాపూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా విజేతగా నిలిచిన మెరుపు టీమ్, రన్నర్స్అంబేద్కర్ నగర్ క్రికెట్ క్లబ్ టీమ్‌లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, సీసీ స్టోర్ చైర్మన్ పొన్నం శ్రీనివాస్, లీడర్లు వాసాల రమేశ్, పొన్నం సత్యనారాయణ, శ్రీనివాస్,
కనకారెడ్డి పాల్గొన్నారు.
మల్లాపూర్, వెలుగు: మల్లాపూర్ పద్మశాలీ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీలు బుధవారం ముగిశాయి. ఎస్సై రాజు, కిసాన్ జిల్లా అధ్యక్షుడు ఎలా జలపతి రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు.