క్రికెట్ టోర్నీ విజేత మహారాష్ట్రలోని కోటపల్లి

క్రికెట్ టోర్నీ విజేత మహారాష్ట్రలోని కోటపల్లి

కోటపల్లి, వెలుగు: కోటపల్లి మండలంలోని వెంచపల్లిలో గ్రామ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. మహారాష్ట్రలోని కోటపల్లి జట్టు విజేతగా నిలిచింది. కోటపల్లి జట్టుతోపాటు వెంచపల్లి జట్టు ఫైనల్​కు చేరుకోగా.. హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో కోటపల్లి విజయం సాధించింది. చీఫ్​గెస్ట్​గా హాజరైన చెన్నూరు రూరల్ సీఐ సుధాకర్​ విన్నర్, నర్నరప్​జట్లకు బహుమతులు అందచేశారు.

క్రీడలు శారీరక దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసం కలిగిస్తాయన్నారు. చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజమల్ల గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేశ్ తివారీ, వెంచపల్లి మాజీ సర్పంచ్ రాజుబాయి సతీశ్, మాజీ ఎంపీటీసీ ఎం.తిరుపతి, కోఅప్షన్ మాజీ సభ్యుడు గరీబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.