కరీంనగర్ టౌన్, వెలుగు: శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా కొత్తపల్లి అల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ లో గురువారం అల్ఫోర్స్ గణిత్ జీల్2023 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ఇస్లావత్ 6,7,8, 9 తరగతుల్లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే ట్రినిటీ కాలేజీలో నిర్వహించిన గణిత దినోత్సవంలో చైర్మన్ ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. విద్యార్థులు రామానుజన్ చూపిన మార్గంలో ముందుకెళ్లాలని సూచించారు.
ఎస్ఆర్ డిజి స్కూల్ లో..
కరీంనగర్ పట్టణంలోని అశోక్ నగర్ ఎస్ఆర్ డిజి స్కూల్ లో మాథ్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భగా విద్యార్థులు నిర్వహించిన విన్యాసాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్, ప్రిన్సిపాల్, టీచర్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు. కొత్తపల్లి: పట్టణంలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో గురువారం శ్రీనివాస రామానుజన్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్స్, టీచర్స్ రామానుజన్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ పి.ఫాతిమారెడ్డి, ప్రిన్సిపాల్స్ ఎ.భార్గవ్, వసంత, నిరంజన్, అకాడమిక్ సీఈఓ ఉమాకాంత్, గ్రూప్-2 ఆఫీసర్చిరంజీవి, టీచర్స్ పాల్గొన్నారు.
మానేరులో..
పట్టణంలోని మానేర్ స్కూల్ లో గణిత దినోత్సవ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా రుక్మాపూర్ లో నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ లో ప్రథమ స్థానం పొంది, రాష్ట్రస్థాయికి ఎంపికైన సాయి శ్రీనికకు చైర్మన్ కడారు అనంతరెడ్డి జ్ఞాపిక అందజేశారు. అనంతరం స్కూల్లో నిర్వహించిన మ్యాథ్స్ ఒలింపియాడ్ లో విజేతలకు బహుమతులు చేశారు.
రాజకీయ భీష్ముడు కాకా
పెద్దపల్లి, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత గడ్డం వెంకటస్వామి(కాకా) రాజకీయ భీష్ముడని, దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని పెద్దపల్లి జిల్లా కాకా అభిమానులు, బీజేపీ నాయకులు అన్నారు. కాకా వర్ధంతి సందర్భంగా గురువారం పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్దపల్లిలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగులకు పండ్లు పంపిణీ చేశారు. సుల్తానాబాద్, మంథనిలోని కాకా విగ్రహాలకు లీడర్లు నివాళులర్పించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో బీజేపీ లీడర్లు ఎస్. సజ్జాద్, ఎ.శ్రీనివాస్, వి.భూమయ్య, ఎ. సదయ్య, సోడాబాబు, జి.పవన్, సంపత్చారీ, సతీశ్, మంథని నాయకులు వి.రాజు, ఎస్. శ్రీనివాస్, ఎన్. మల్లకృష్ణ పాల్గొన్నారు.
మహా నాయకుడు కాకా వెంకటస్వామి..
గోదావరిఖని: పేదల గుండెల్లో కొలువైన మహా నాయకుడు కాక వెంకటస్వామి అని, కార్మికులు, పేద ప్రజల కోసం ఆయన నిరంతరం శ్రమించారని పలుపార్టీల లీడర్లు కొనియాడారు. కాకా వర్ధంతి సందర్భంగా గురువారం గోదావరిఖనిలోని జీఎం ఆఫీస్ మూలమలుపు వద్ద ఉన్న కాకా విగ్రహానికి లీడర్లు ఘనంగా నివాళులర్పించారు. బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ పి.మల్లికార్జున్, లీడర్లు కౌశిక హరి, ఎస్. లావణ్య, అరుణ్ కుమార్, బి.అమరేందర్ రావు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో లీడర్లు ఎం. రామన్న, ఆర్.కోటేశ్వర్లు, బి.మల్లేశ్‌యాదవ్, పి.గోవర్ధన్ రెడ్డి, బి.మల్లికార్జున్ గౌడ్, కె.విజయ్, సునీల్ కుమార్, టి.మధు, ఎన్. రవి, పి.శశికుమార్, బి.రవివర్మ తదితరులు పాల్గొన్నారు. అలాడే గోదావరిఖని కోదండ రామాలయంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో కాకా వర్ధంతి సందర్భంగా విశాఖ ఇండస్ట్రీస్, కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం(భిక్ష) చేశారు. కార్యక్రమంలో లీడర్లు జి.కుమారస్వామి, పి.మల్లికార్జున్, గురుస్వామి హనుమంతరావు, కార్పొరేటర్ ఎ.రామస్వామి తదితరులు పాల్గొన్నారు. అలాగే యైటింక్లయిన్ కాలనీలో టీఆర్‌ఎస్ కార్పొరేటర్, కాకా వీరాభిమాని శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో కాకా చిత్రపటానికి నివాళులర్పించారు.
పెద్దపల్లి జిల్లాకు కాకా పేరు పెట్టాలి..
కరీంనగర్ టౌన్:పెద్దపెల్లి జిల్లాకు వెంకటస్వామి జిల్లాగా నామకరణం చేయాలని కాంగ్రెస్ ఎస్సీసెల్ టౌన్ ప్రెసిడెంట్ లింగంపల్లి బాబు డిమాండ్ చేశారు. కాకా వర్ధంతి సందర్భంగా కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో గురువారం నివాళులర్పించారు. అనంతరం స్థానిక కార్ఖానాగడ్డలోని వృద్ధులు, వికలాంగుల ఆశ్రమంలో బాబు ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు బి.విక్టర్, ఎన్.శ్రీనివాస్, దినకర్, కె. రాజ్ కుమార్, ఎం.యాదగిరి పాల్గొన్నారు.
పేదల పక్షపాతి కాకా..
హుజూరాబాద్: కాకా వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో వెంకటస్వామి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు సొల్లుబాబు, పుష్పలత, రాజు, అఫ్సర్, రవీందర్, రమేశ్, ఐలయ్య, రిజాజ్ పాల్గొన్నారు.
వెల్గటూర్: ఓటమెరుగని లీడర్ వెంకటస్వామి అని బీజేపీ స్టేట్లీడర్, ఎండపెల్లి ఎంపీటీసీ బషీర్ అన్నారు. కాకా వర్ధంతి సందర్భంగా గురువారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో నివాళులర్పించారు. కార్యక్రమం లో కాక అభిమానులు బాలలింగు, మంథని నర్సయ్య, లక్ష్మారెడ్డి, చంద్రయ్య, రాజేశ్వర్ రెడ్డి, దేవి రవీందర్ పాల్గొన్నారు.
కోరుట్ల:పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో గురువారం కాకా వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కోరుట్ల మండల, పట్టణాధ్యక్షుడు కొంతం రాజం, తిరుమల గంగాధర్మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కోరుట్ల బ్లాక్ అధ్యక్షుడు పి.సత్యనారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి టి.భాజన్న, కార్యదర్శి డి. వెంకట్, సహాయకార్యదర్శి ఎం.సత్యనారాయణ, టి.శంకర్, జి.శ్రీధర్, విజయ్ పాల్గొన్నారు.
సింగరేణికే తెలంగాణ బొగ్గు
గోదావరి ఖని, వెలుగు: తెలంగాణ లోని బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు కేటాయించేందుకు కోసం ఐక్యంగా పోరాడుతామని వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రతిజ్ఞ చేశారు. అక్షర ఫౌండేషన్ సౌజన్యంతో గురువారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో జరిగిన అఖిలపక్ష పార్టీల సదస్సులో లీడర్లు మాట్లాడారు. తెలంగాణ బొగ్గు సింగరేణికే చెందాలనే నినాదంతో పోరాటానికి, త్యాగాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో సింగరేణి సంస్థ గుర్తించిన బొగ్గు బ్లాకులను వేలం వేయడం వలన సింగరేణి సంస్థ ఉనికికే ప్రమాదకరమని పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ మల్లికార్జున్, సింగరేణి పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు మునీర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మక్కాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
స్టేట్ ఒలింపియాడ్‌లో ‘వీణాధరి’ ప్రతిభ
చొప్పదండి, వెలుగు: శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో చొప్పదండి పట్టణంలోని వీణాధరి స్కూల్విద్యార్థులు ప్రతిభ కనబరిచారని కరస్పాండెంట్ తిప్పర్తి శ్రీనివాస్ తెలిపారు. టెస్టులో 6వ తరగతి విద్యార్థి కొక్కుల శ్రీహర్షిత్ రాష్ట్రస్థాయిలో 2వ స్థానం, 10వ తరగతి విద్యార్థిని ఎన్నం మణిదీప 4వ స్థానం, 7వ తరగతి విద్యార్థి మొగిలి మణితేజ జిల్లాలో 2వ స్థానాన్ని సాధించారన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్ఐటీ డైరెక్టర్ రమణారావు, ఇన్కమ్ టాక్స్ కమిషనర్ జీవన్ లాల్, గురుకుల సీవోయి కో ఆర్డినేటర్ కిషోర్, జబర్దస్త్ హాస్యనటులు అప్పారావు, రమేశ్ అవార్డులు అందించినట్లు పేర్కొన్నారు. గురువారం స్కూల్లో ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులను కరస్పాండెంట్, హెచ్ఎం, టీచర్లు
అభినందించారు.