నిజామాబాద్, వెలుగు: కోటగిరి మండలం కొత్తపల్లి హైస్కూల్ హెచ్ఎం కిషన్‌ను సస్పెండ్ చేశారు. బుధవారం ఈ మేరకు డీఈవో దుర్గాప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 2న పది మంది స్టూడెంట్స్ మధ్యాహ్నం కారంపొడితో అన్నం తిన్న ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకున్నారు.
120 మంది స్టూడెంట్స్ ఉన్న స్కూల్లో మాడిన కూరతో పిల్లలు భోజనం చేయగా 7, 8 క్లాస్ పిల్లలు కారంతో తిన్నారు. ఈ విషయం వైరల్ కావడంతో గత శనివారం డీఈవో విచారణ నిర్వహించారు. ఎండీఎం ఏజెన్సీపై అజమాయిషీ చేయని కారణంగా హెచ్ఎం కిషన్‌ను సస్పెండ్ చేశారు. ఘటన జరిగిన రోజు డ్యూటీలో ఉన్న మరో ఇద్దరు టీచర్లకు మెమో జారీ చేశారు.