డబుల్ బెడ్రూం కోసం పోతే ఎస్సై బూతులు తిట్టిండు

కరీంనగర్ జిల్లాలోని చింతకుంట దగ్గర నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆక్రమించుకునేందుకు ఇయ్యాళ మరో పదిమంది మహిళలు వెళ్లారు. నిన్న దాదాపు 30 మంది మహిళలు వెళ్లి  అపార్టు మెంట్ పద్ధతిలో కట్టిన ఫ్లాట్లపై తమ పేర్లు రాసుకుని, వెళ్లిపోయారు. కాగా ఈ రోజు కూడా నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇండ్ల వద్దకు మరి కొంది మహిళలు రావడంతో వారిని లోపలికి వెళ్ళనీయకుండా కొత్తపల్లి ఎస్సై ఎల్లా గౌడ్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎస్సై ఎల్లాగౌడ్ తమను అసభ్య  పదజాలంతో  దూషించాడని ఆరోపిస్తూ మహిళలు కలెక్టర్ ను కలిసేందుకు కలెక్టరేట్ కు వచ్చారు.   డబుల్ బెడ్ రూం ఇండ్లను ఆక్రమించుకున్న మహిళలు.. నిరుపేదలైన తాము అద్దె ఇండ్లలో ఉంటూ కిరాయిలు కట్టలేని పరిస్థితుల్లో ఇక్కడకు వచ్చామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం పూర్తై నెలలు గడుస్తున్నా అర్హులకు అలాట్ చేయకపోవడంతోనే వారు వాటిని ఆక్రమించుకున్నారని చెప్పారు.