- సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ అమలు కాలే
- బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్నాక్ విజయ్ కుమార్
ఆసిఫాబాద్, వెలుగు : పోడు రైతులపై పెట్టిన కేసులను ఎత్తేస్తం అని జూన్ 30న ఆసిఫాబాద్ సభలో ప్రకటించిన సీఎం కేసీఆర్ ఇప్పటికీ ఆ కేసులను మాఫీ చేయకుండా గిరిజనులను మోసం చేస్తున్నారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్నాక్ విజయ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం సిర్పూర్ యూ మండలంలోని బాబ్జీపెట్, అమృత్ రావు గూడ, చింతకర్రలో గిరిజన సంప్రదాయ వాయిద్య నడుమ ప్రచారం నిర్వహించారు.
మహిళల కాళ్లు మొక్కారు. పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలను మోసం చేసిన కేసీఆర్ కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శులు రాథోడ్ సందీప్, ఆత్రం మనోహర్, సిర్పూర్ యూ మండల అధ్యక్షులు గెడం శంభూ, జైనుర్ మండల అధ్యక్షుడు కొట్నక దౌలత్ రావు తదితరులు పాల్గొన్నారు.