వికారాబాద్, వెలుగు: ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) స్కీమ్ కు జిల్లాలోని కోట్పల్లి జెడ్పీ స్కూల్ ఎంపికైంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా పీఎంవో నుంచి స్కూల్ ఉపాధ్యాయుడు లక్ష్మణ్, విద్యార్థి సాయి చరణ్ కు ఆహ్వానం అందింది. మంగళవారం ఢిల్లీకి వెళ్లారు.
ఇండియా గేట్, వార్ మెమోరియల్ వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వారు పాల్గొంటారని ఎంఈవో చంద్రప్ప తెలిపారు. స్కూల్ అభివృద్ధి కి కేంద్ర ప్రభుత్వం రూ. 2 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు.