- హైడ్రా కమిషనర్ కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
మేడిపల్లి, వెలుగు: బోడుప్పల్ పరిధిలోని చెరువులను రక్షించి, ఎఫ్ టీఎల్ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిశోర్ గౌడ్ కోరారు. శుక్రవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు కంప్లయింట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చెంగిచెర్ల సర్వే నంబర్59లో 4 ఎకరాల12 గుంటల భూమి ఉండగా.. ఇందులో అక్రమార్కులు ప్లాట్లు చేసి అమ్మినట్టు ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సర్వే నంబర్ 57 లోని ఓపెన్ ల్యాండ్ లో ఎఫ్ టీఎల్ పరిధిలో కమర్షియల్ బిల్డింగ్ నిర్మిస్తున్నారని, వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. చెంగిచెర్ల చింతల చెరువులోనూ పలు అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారని వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బోడుప్పల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొత్త ప్రభాకర్ గౌడ్, నేతలు కుర్రి శివ శంకర్ ఉన్నారు.