రాంపూర్‌‌ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా: కొత్త ప్రభాకర్ రెడ్డి

రాంపూర్‌‌ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా: కొత్త ప్రభాకర్ రెడ్డి

తొగుట, వెలుగు: మల్లన్నసాగర్  నిర్వాసితుల త్యాగాలు వెలకట్ట లేనివని మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి  కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని జప్తిలింగారెడ్డి పల్లి,  బంజేరుపల్లి,  లింగాపూర్, వెంకట్రావు పేట, చందాపూర్, రాంపూర్, తొగుట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. .

ప్రజలందరూ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.  రాంపూర్ నుంచి మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ కు ర్యాంప్ వేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాంరెడ్డి, సర్పంచ్ లు జ్యోతి, రజిత, మంజుల, లీలాదేవి, శ్యామల, ఎంపీటీసీ లలిత పాల్గొన్నారు.