కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లాలో ఓ అవినీతి చేప ఏసీబీ వలలో చిక్కింది. లంచం తీసుకుంటూ కొత్తగూడెం జిల్లా హార్టికల్చర్ అధికారి ఏసీబీకి పట్టుబడ్డారు. పక్కా సమాచారంతో కొత్తగూడెం కలెక్టరేట్ లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు హార్టికల్చర్ ఆఫీసర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
కొత్తగూడెం కలెక్టరేట్ లో బుధవారం (సెప్టెంబర్18న) ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో జిల్లా హార్టికల్చర్ఆఫీసర్ సూర్య నారాయణ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. డ్రిప్ ఇరిగేషన్ పర్మిషన్ కోసం లంచం డిమాండ్ చేసిన సూర్యనారాయణ..బాధితుడి నుంచి రూ.1.14 లక్షలుతీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హార్టికల్చర్ అధికారి సూర్య నారాయణను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఏసీబీ డిఎస్పీ వై.రమేష్.