- కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
- ముగిసిన జిల్లా స్కూల్ గేమ్స్ఫెడరేషన్ క్రీడా పోటీలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న క్రీడా పోటీలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన క్రీడాకారులకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. ఈ ప్రోగ్రాంలో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, డీఈఓ ఎం. వెంకటేశ్వరాచారి, మున్సిపల్ కమిషనర్ శేషాంజన్ స్వామి, లక్ష్మీ నరసయ్య, వాసిరెడ్డి నరేశ్కుమార్తో పాటు పలువురు పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలి
అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని ఎమ్మెల్యే కూనంనేని ఆఫీసర్లుకు సూచించారు. పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి పనుల నాణ్యతలో లోపాలుంటే ప్రజలు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ ప్రోగ్రాంలో మున్సిపల్ చైర్ పర్సన్ కే. సీతాలక్ష్మి, మున్సిపల్కమిషనర్శేషాంజన్స్వామి, తహసీల్దార్ పుల్లయ్య, డీఈ రవి కుమార్తో పాటు పలువురు కౌన్సిలర్లు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే, సాబీర్ పాషా పాల్గొన్నారు.