
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కరీంనగర్ లో పర్యటించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీలను ఎవరు నమ్మరని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దుర్మార్గమైన పాలన కొనసాగిస్తోందన్నారు. కేంద్రం తాత్కాలిక ఉపయోగాల కోసమే చేస్తుందని దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమం ఎలాంటి పనులు చేపట్టలేదన్నారు. తెలంగాణలో బీజేనీ ఆటలు సాగవన్న కూనం నేని సీపీఐ ప్రజా సమస్యలపై పోరాడుతోందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు గాలిలో మేడలు కడుతున్నారని.. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని కాషాయ నేతలు ఓట్లు అడుగుతున్నారని.. కేంద్ర నుంచి తెలంగాణకు రావలసిన నిధుల్లోఅన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే కూనంనేని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక నిథులు కేటాయించిన బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణకు మాత్రం 2.4 శాతమే ఇస్తూ.. నిబంధనలకు విరుద్దంగా.. ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం పాలన ఉందని దుయ్యబట్టారు.