భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అక్రమంగా పెద్దమొత్తంలో తరలిస్తున్న గంజాయిని కొత్తగూడెం పోలీసులు గురువారం పట్టుకున్నారు. కొత్తగూడెం వన్‌టౌన్ సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం పట్టణంలోని అండర్ బ్రిడ్జ్ వద్ద ఎస్సై విజయ ఆధ్వర్యంలో సిబ్బంది వెహికల్స్తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారును తనిఖీ చేయగా 93 ప్యాకెట్లలో 186 కేజీల గంజాయి దొరికింది.
దీని విలువ దాదాపు రూ. 75లక్షలు ఉంటుంది. ఒరిస్సాలోని మల్కాన్‌గిరి ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని షోలాపూర్‌కు గంజాయి తరలిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. నిందితులు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేటకు చెందిన పెనుగొండ నరసింహులు, భూక్యా లక్ష్మణ్, కుంచం లక్ష్మణ్‌గా గుర్తించి వారిని అరెస్టు చేశారు. తనిఖీల్లో పాల్గొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు, వన్‌టౌన్ పోలీసులను ఎస్పీ బి. రోహిత్ రాజు అభినందించారు.