అధ్వాన్నంగా కస్తూర్బా స్కూళ్ల నిర్వహణ : డీసీసీ అధికార ప్రతినిధి కొట్టం మనోహర్

  • డీసీసీ అధికార ప్రతినిధి కొట్టం మనోహర్

కోటగిరి, వెలుగు: కస్తూర్బా స్కూళ్లల్లో నిర్వహణ అధ్వాన్నంగా ఉందని జిల్లా డీసీసీ అధికార ప్రతినిధి కొట్టం మనోహర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని కస్తూర్బా స్కూల్​ను సందర్శించారు. మనోహర్​ మాట్లాడుతూ..స్కూల్​లో కనీస వసతులు లేక పేదపిల్లలు ఇబ్బందులు పడుతున్నా, పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. 

స్కూల్​లో టీచర్లు కూర్చునేందుకు కుర్చీలు లేకపోతే తను 10 కుర్చీలు ఇచ్చినట్లు చెప్పారు. ఆడపిల్లల బాత్రూమ్​లకు కనీసం డోర్లు కూడా లేకపోవడం బాధించిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ మాత్రం చిత్త శుద్ధి ఉన్నా, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్​చేశారు. ఆయన వెంట పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గంగాధర్ దేశాయ్ తదితరులు ఉన్నారు.