అహంకారంతో విర్రవీగిన బీఆర్ఎస్‌కు నేడు పోటీకి అభ్యర్థులు లేరు: కూనంనేని

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత కమ్యునిస్ట్ పార్టీ జిల్లా స్థాయి శిక్షణ తరగతుల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన భవిష్యత్ లో బీఆర్ఎస్ పార్టీ మూసివేయడం తథ్యమని అన్నారు. అహంకారంతో విర్రవీగిన బీఆర్ఎస్ పార్టీ నేడు ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేక మదనపడుతున్న పరిస్థితుల్లో ఉందని ఆయన ఆరోపించారు. 

అనవసరంగా సెక్రెటేరియట్ ను కూల్చి మళ్లీ నిర్మించిదని మండ్డిపడ్డారు. ఇలాగే ఇష్టానుసారంగా వ్యవహరించి గత ప్రభుత్వం అనేక నిర్మాణాల్లో అవినీతికి పాల్పడిందన్నారు. అప్పుడు కేసీఆర్ రాజులా, కేటీఆర్ యువరాజులా నేలమీద నిలబడలేదని బీఆర్ఎస్ ని విమర్శించారు. ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒకటి రెండు సీట్లు గెలవడమే కష్టమని జోస్య చెప్పారు. ఎంత వేగంగా టిఆర్ఎస్ భవనం నిర్మించారో.. అంతే వేగంగా బీఆర్ఎస్ భవనం పేక మేడలా కూలిపోవడానికి సిద్ధంగా ఉందని సాంబశివరావు తెలిపారు.