సత్తుపల్లిలో బాండ్ పేపర్ రాజకీయం.. మానవతారాయ్ ప్రత్యేక హామీలు

తనను సత్తుపల్లి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానంటున్నారు తెలంగాణ పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే.. 100 రూపాయల బాండ్ పేపర్ పై రాసి ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తానంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్, రేణుకా చౌదరి, సంభాని చంద్రశేఖర్, మల్లు భట్టి విక్రమార్కల సహకారంతో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తామని 100 రూపాయల బాండ్ పేపర్ పై రాతపూర్వక హామీ ఇస్తున్నానని చెప్పారు.

కోటూరి మానవతారాయ్ హామీలు ఇవే :

ఒకటో హామీ : సత్తుపల్లి ప్రజల చిరకాల వాంఛ అయిన సత్తుపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తామని హామీ 

రెండవ హామీ : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సత్తుపల్లి థర్మల్ పవర్ స్టేషన్ ను ఏర్పాటు చేసి.. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ

మూడవ హామీ : సత్తుపల్లి నియోజకవర్గంలో అన్యాక్రాంతంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి.. గజం జాగాలేని నిరుపేదలకు 120 గజాల చొప్పున పంచుతామని హామీ