పాల్వంచ, వెలుగు: పట్టణంలోని పాత పాల్వంచలో చింతల చెరువు కట్టపై రూ .10 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న మినీ ట్యాంక్ బండ్ పనులను వెంటనే పూర్తి చేయాలని డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.
మంగళవారం ఆయన ట్యాంక్ బండ్ నిర్మా ణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారుల నుంచి పలు వివరాలు తెలుసుకున్నారు. అలాగే పట్టణంలో నిలిచిపోయిన తాగునీటి సరఫరాను తక్షణమే ప్రారంభించాలని మున్సిపాలిటీ అధికారులను కోరారు. ఈ కార్యక్రమాల్లో ఇరిగేషన్, మున్సిపల్ ఏఈలు బానోతు మంగూ నాయక్, రాజేశ్‌తో పాటు చి ట్యాల వెంకటరెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.