నటీనటులు:ఐశ్వర్య రాజేష్,రాజేంద్ర ప్రసాద్, శివకార్తికేయన్ , సత్య కార్తీక్ , వెన్నెల కిషోర్
ఝాన్సీ , CVL నరసింహ రావు , రవి ప్రకాష్.
నిర్మాత :వల్లభ,
దర్శకుడు : భీమనేని శ్రీనివాసరావు,సమర్పణ : కె ఎస్ రామారావు.
రిలీజ్ తేదీ : 23 ఆగస్టు 2019.
కథ :
కౌసల్య (ఐశ్వర్య రాజేష్) తండ్రి కృష్ణమూర్తి (రాజేంద్ర ప్రసాద్) గొప్ప క్రికెట్ అభిమాని మరియు సహజంగా, కౌసల్య క్రికెట్ పట్ల అభిమానం మరియు అభిరుచిని పెంచుకుంటుంది.చిన్నప్పటి నుండే తన అన్న తో కలిసి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ ట్రైనింగ్ కూడా తీసుకుంటుంది. తన ఒక్క అమ్మాయి కోరిక తీర్చటం కోసం తండ్రి కృష్ణమూర్తి ఎంతో ప్రేమగా చూసుకునే తన ఇల్లుని తాకట్టు పెట్టు మరీ స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ కి ఆడేలా పెంచుతాడు. మరి కౌసల్య ఎలా ఆడింది, కృష్ణమూర్తి తన ఇల్లు ఎలా తిరిగి పొందాడో సినిమా చూడాలి.
నటీనటుల పెర్ఫార్మెన్స్ :
ఐశ్వర్య రాజేష్ ప్రతి సీన్ లో క్రికెటర్ లా కనిపిస్తుంది, ఆట పట్ల తనకున్న కామిట్మెంట్ కోసం తను చేసిన నటన చాలా బాగుంది. రైతు పాత్రలో సీనియర్ నటుడు అయిన రాజేంద్రప్రసాద్ తండ్రి పాత్రకు ప్రాణం పోసాడు. ఇక తల్లిగా చేసిన ఝాన్సీకి కూడా మంచి పాత్రే అని చెప్పాలి,ఎక్కువ స్కోప్ ఉన్న తల్లి పాత్ర ఝాన్సీకి బాగా సూట్ అయ్యింది. కోచ్ పాత్రలో శివ కార్తీకేయన్ చాలా చక్కగా చేసాడు,
టెక్నికల్ వర్క్: సినిమాటోగ్రఫీ బాగుంది. కామరాజ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ అయ్యింది.
సినిమా విశ్లేషణ :
దర్శకుడు భీమనేని శ్రీనివాస్ రావ్ చేసిన ఈ రీమేక్ సినిమా టాలీవుడ్ లో ఐశ్వర్య రాజేష్ మంచి ఎంట్రీ అని చెప్పాలి. ఒక క్రికెటర్ గా తన పాత్రలో ఒదిగి పోయింది ఐశ్వర్య. క్లైమాక్స్ లో వచ్చిన సీన్స్ లో ప్రేక్షకులకు కంటతడి పెట్టిస్తుంది కూడా ఈ సినిమా. ఇక రైతుల ఆత్మహత్యలపై, వాళ్ళ దుస్థితి పై చేసిన కొన్ని సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి.భారతదేశంలో క్రికెట్ కి ఉన్న ఆదరణను, రైతుల కష్టాలను (వ్యవసాయం) కలుపుతూ దర్శకుడు చాలా బాగా తీశాడు.కోచ్ పాత్రలో శివ కార్తికేయ చాలా బాగున్నా తెలుగులో మంచి పేరు ఉన్న హీరో చేసి ఉంటే సినిమాకు హెల్ప్ అయ్యేది.ఓవరాల్ గా కౌసల్య కృష్ణమూర్తి సినిమా మెప్పిస్తుంది.