రైతు బంధు తీసుకోవడం లేదా.. నీకు సిగ్గుందా ... అంటూ  రైతులపై  కౌశిక్ రెడ్డి ఆగ్రహం

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో  రుణ మాఫీ గురించి అడిగిన రైతు బుర్రాశ్రీనివాస్ ను ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి రైతుబంధు తీసుకోవడం లేదా.. అడగడానికి సిగ్గుండాలంటూ అవమాన పర్చే విధంగా మాట్లాడారు.  రోజు రోజుకు అధికార పార్టీ నేతల ఆగడాలు ఎక్కువవుతున్నాయి.  సభ ఎందుకు పెట్టామన్న విషయం మర్చిపోయి అక్కడి వచ్చిన వారు ఏదైనా ప్రశ్నిస్తే తట్టుకొనే పరిస్థితిలో లేని బీఆర్ఎస్ నేతలు. ..  రైతులను  పబ్లిక్ మీటింగ్ లో అవమానకరంగా దూషిస్తున్నారు. 

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన దశాబ్ది వేడుకల్లో  ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి రైతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తామని చెప్పి మూడు నెలలైనా ఎందుకివ్వలేదని రైతులు ఆయనను ప్రశ్నించారు.  దీంతో చిర్రుబుర్రు లాడుతూ పది రోజుల్లో వస్తుందిలే అన్నారు.

రుణమాణీ గురించి అడిగిన రైతు కాంగ్రెస్ కార్యకర్త కావడంతో  నీకెన్ని ఎకరాల పొలం ఉందని కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్నకు తనకు మూడెకరాలు ఉందని చెప్పగా... రైతు బంధు తీసుకోవడం లేదా.. కూర్చో కూర్చో.. నీకు సిగ్గు శరం ఉందా.. పింఛన్ తీసుకోవడం లేదా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

చూశారా.. మన గులాబీ నేతల వ్యవహారం. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల గురించి అడిగితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అన్నదాతలపై కస్సు బుస్సు అనడం అధికార పార్టీ కి రైతుల పట్ల ఎంత గౌరవం ఉందో అద్దం పట్టినట్లు కనపడుతుందని స్థానికులు వాపోతున్నారు.