అతని పేరు నటరాజన్.. తమిళనాడు నుంచి బతుకుతెరువు కోసం కేరళ వెళ్లాడు. అక్కడే జీవనం సాగిస్తున్నాడు. దిగువ మధ్యతరగతి కుటుంబం. అతని ఓ అలవాటు ఉంది. అదే లాటరీలు కొనటం. ప్రతి ఏటా లాటరీలు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటాడు. ఈ సారి కూడా అలాగే చేశాడు. కేరళలో ప్రతి ఏడాది ఓనం పండుగ సందర్భంగా నిర్వహించే అతిపెద్ద లాటరీ ఉంటుంది. ఆ లాటరీ మొదటి బహుమతి అక్షరాల 25 కోట్ల రూపాయలు. ఈ లాటరీ ఈసారి నటరాజన్ కు తగిలింది
సాధారణంగా కేరళలో ఓనం, విషు, క్రిస్మస్ వంటి ప్రత్యేక పండుగల సమయాల్లో కేరళ లాటరీ డిపార్ట్ మెంట్ బంపర్ లాటరీ టికెట్లు జారీ చేస్తుంది. తిరుఓనం పండుగ సందర్భంగా తిరుఓనమ్ బంపర్ బీఆర్ 93 లాటరీలో మొత్తం 66 లక్షల టికెట్లను విక్రయించారు. ఇందులో భాగంగానే ఓ వ్యక్తి లాటరీ కొనుగోలు చేశాడు.
బుధవారం కేరళ ప్రభుత్వం డ్రా తీయగా.. తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన గోకులం నటరాజ్ అనే వ్యక్తికి లాటరీ తగిలింది. తిరుఓనం బంపర్ బీఆర్ -93 లక్కీ డ్రాలో TE230662 టికెట్ కు మొదటి బహుమతి కింద రూ. 25 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. దీంతో నటరాజన్ ఎగిరి గంతులేశాడు. రూ.25 కోట్లలో 30 శాతం ట్యాక్స్ పోగా...అతడికి రూ.17.5 కోట్లు ఇవ్వనున్నారు. రెండో విజేతకు రూ.కోటి, మూడో విజేతకు రూ. 50లక్షలు ,నాలుగో విజేతకు రూ. 5లక్షల చొప్పున ప్రకటించారు.
ALSO READ : ప్రభాస్ కల్కి లీక్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.. వైజయంతి మూవీస్
ఇక ఈ ఏడాది విషు బంపర్ బీఆర్ 91 కింద నిర్వహించిన లాటరీలో VE 475588 నంబరు తొలి ప్రైజ్ దక్కించుకుంది. ఈ లాటరీ టికెట్ రూ. 12 కోట్లు దక్కించుకోనున్నారు.