
నారాయణపేట, వెలుగు: మెడికల్ కాలేజీలో క్లాసులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం అప్పంపల్లిలో మెడికల్ కాలేజీలో క్లాస్ రూమ్స్, ఇతర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ అకడమిక్ ఇయర్ నుంచే మెడికల్ కాలేజీలో క్లాసులు ప్రారంభం అవుతాయని, అప్పటి వరకు అన్ని ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిట్టల్ పాల్గొన్నారు.