
నారాయణపేట, వెలుగు: ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెండు ప్లాటూన్ల కేంద్ర బలగాలు జిల్లాకు వచ్చినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో చెక్ పోస్ట్ ల వద్ద బందోబస్తు, సమస్యాత్మక గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్, ఎన్నికల సమయంలో జిల్లా పోలీసులతో పాటు విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. జిల్లా ఎస్పీ యోగేశ్గౌతమ్ తో కలిసి కలెక్టర్ కేంద్ర బలగాలకు పలు సూచనలు చేశారు.