టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. డ్రగ్స్ కిలాడి కేపీ చౌదరి విచారణలో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో చాలా మంది ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా.. కేపీ చౌదరి ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. టాలీవుడ్ లోని చాలా మంది ఫోటోలను గుర్తించారు.
అందులో ప్రధానంగా సినీ నటి సురేఖావాణి, బిగ్ బాస్ బ్యూటీ ఆషు రెడ్డి పేర్లు మాత్రమే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి కారణం.. కేపీ చౌదరితో ఈ ఇద్దరు ఎక్కువసార్లు మాట్లాడటమే అని పోలీసులు చెప్తున్నారు. అయితే కేపీ చౌదరి ఫోన్లో సురేఖావాణి, ఆషు రెడ్డిలతో పాటు.. చాలా మంది టాలీవుడ్ యాక్టర్స్ ఫోటోలు కూడా ఉన్నాయి. అందులో నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో నిఖిల్, హీరో వెంకట్, దర్శకుడు రాంగోపాల్ వర్మ, నటుడు రాజారవీంద్ర, నటి హరితేజ, యాక్టర్ జ్యోతి, క్యారెక్టర్ ఆర్టిస్టు హేమ వంటి టాప్ సెలబ్రెటీస్ ఉన్నారు. అయితే వీళ్లందరిలో కేవలం ఆషు రెడ్డి, సురేఖావాణిల పేర్లు మాత్రమే హైలెట్ అవడం ఇప్పుడు చర్చనియ్యాంశం అయ్యింది.
ఈ న్యూస్ తెల్సుకున్న చాలా మంది.. సెలబ్రెటీలు అన్నాక వారితో ఎవరైనా ఫోటోలు దిగుతారు. అది సహజం. కేవలం ఫోటోలు దిగినంత మాత్రాన వారు తప్పు చేశారు అనుకోవడం కరక్ట్ కాదు. అలా అయితే కేపీ చౌదరితో ఫొటోస్ దిగిన మిగతా వారి సంగతేంటి? వారిని ఎందుకు హైలెట్ చేయడం లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.