నేపాల్ కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు కేపీ శర్మ ఓలి. 22మందితో కేబినేట్ ను ఏర్పాటు చేశారు. అందులో మిత్రపక్షాలకు చెందిన నలుగురికీ అవకాశం కల్పించారు కేపీ శర్మ ఓలి. అంతకముందు ప్రధానిగా ఉన్న ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయి కుప్పకూలింది. ఈక్రమంలోనే ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని సీపీఎన్-యూఎంఎల్, మరో మాజీ ప్రధాని షేర్ దేవ్ బా సారథ్యంలోని నేపాల్ లోని కాంగ్రెస్ కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఓలి ఇంతకుముందు మూడు సార్లు ప్రధానిగా పనిచేశారు. కొన్ని రోజుల ముందే ఓలి, దేవ్ ల మధ్య అధికారాన్ని పంచుకోవడంపై ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తొలి 18నెలలు ఓలి ప్రధానిగా ఉంటారు. ఆతర్వాత పార్లమెంట్ గడువు ముగిసేవరకు దేవ్ బా ప్రధానిగా కొనసాగుతారు.
ALSO READ | నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ.. నెగ్గిన అవిశ్వాస తీర్మానం