మండలిలో బీఆర్​ఎస్ విప్​గా సత్యవతి

మండలిలో బీఆర్​ఎస్ విప్​గా సత్యవతి
  • అసెంబ్లీలో విప్​గా కేపీ వివేకానంద్​

హైదరాబాద్, వెలుగు: శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ​విప్​గా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, అసెంబ్లీలో విప్​గా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ నియమితులయ్యారు. వారి నియామకం గురించి తెలియజేస్తూ పార్టీ చీఫ్​ కేసీఆర్​ఇచ్చిన లేఖను మంగళవారం స్పీకర్​కు కేటీఆర్​ఆధ్వర్యంలో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందజేశారు. కాగా, మంగళవారం సాయంత్రం సభ నుంచి వాకౌట్ చేశాక కేటీఆర్, హరీశ్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ తో భేటీ అయ్యారు.