ఓరి దేవుడా : కరోనా కొత్త వైరస్ KP.3 వచ్చేసింది.. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే..?

కరోనా ఇంకా పూర్తిగా పోలేదు..కొత్త వేరియంట్లతో ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంది.గతంలో ఉన్న వేరియంట్ల కంటే కొత్తగా వస్తున్న వేరియంట్లు ప్రమాదకర మైన వట. నిన్నటి వరకు JN1 వేరియంట్ కరోనా వైరస్ అమెరికా వంటి కొన్ని దేశాలను భయపెడితే.. తాజాగా KP.3 అనే కోవిడ్ కొత్త వేరియంట్ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. కొత్త లక్షణాలతో ప్రజలను కలవరపెడుతోంది. 

KP.3 వేరియంట్, KP.2 మరో కోవిడ్ వేరియంట్.. అమెరికాలో నమోదు అవుతున్న కోవిడ్ కేసుల్లో 25 శాతం ఇవేనట.  ఈ రెండు వేరియంట్లు  FLiRT గ్రూప్ లో భాగం. ఇది తేలికపాటి , తీవ్రమైన లక్షణాలతో అమెరికా ప్రజలను భయపెడుతున్నాయి. ప్రాణాంతకం కాకపోయినప్పటికీ ఈ KP.3కోవిడ్ కొత్త వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉంటుందంటున్న వైద్యులు. KP.3కోవిడ్ కొత్త వేరియంట్ లక్షణాలు, వైరస్ వ్యాప్తి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. 

KP.3  కోవిడ్ వేరియంట్ గురించి.. 

KP.3  కోవిడ్ వేరియంట్ అనేది JN1 వేరియంట్ రూపాంతరం.KP.2 వేరియంట్ కూడా మరొక రూపాంతరం.. ప్రస్తుతం నమోదు అవుతున్న కేసుల్లో 25 శాతం ఈ రెండు వేరియంట్లే ఉన్నాయని CDC ప్రతినిధులు చెబుతున్నారు.   

KP.3 కోవిడ్ వేరియంట్ లక్షణాలు ..

KP.3 కోవిడ్ వేరియంట్  తేలికపాటి నుంచి తీవ్రమైన జ్వరం, పొడిదగ్గు,అలసట, రోగి రుచి లేదా వాసన కోల్పోవడం వంటి లక్షణాలను కనిపిస్తాయి. శ్వాసలో ఇబ్బంది ఏర్పడటం, కండరాలు లేదా కీళ్ల నొప్పులు, తలనొప్పి తరుచుగా వచ్చే లక్షణాలు. 

KP.3 కోవిడ్ వేరియంట్  జీర్ణాశయ సంబంధిత సమస్యలు కూడా ఏర్పడతాయంటున్నారు నిపుణులు, వికారం, వాంతులు వంటి లక్షణాలు కూడా ఈ వైర్ సోకినప్పుడు కనిపిస్తాయంటున్నారు. శరీరంపై దద్దుర్లు, వేళ్లు, కాలి రంగు మారండం వంటి చర్మ సమస్యలు కనిపిస్తాయి. కొంతమంది న్యుమోనియా, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ వంటి ప్రాణాంతకమైన సమస్యలు కూడా అభివృద్ధి చెందినట్లు తెలుస్తోంది. 

పిల్లలో కోవిడ్ లక్షణాలుంటే అశ్రద్ధ చేయొద్దు.. 

పిల్లలు, టీనేజర్లు పెద్దలతో పోలిస్తే.. KP.3 వేరియంట్ తేలికపాటి లక్షణాలను కనిపిస్తాయి. అయినప్పటికీ మల్టీ సిస్టమ్ ఇన్ ఫ్టామేటరీ సిండ్రోమ్ అని పిలువబడే తీవ్రమైన ఆనారోగ్య పరిస్థితి పిల్లల్లో కనిపిస్తుందట. 

KP.3 వేరియంట్ పై వ్యాక్సిన్ పనిచేస్తుందా?

కోవిడ్ 19 KP.3 వేరియంట్  ఇన్ ఫెక్షన్ నివారించడంలో అనేక పద్దతులు అందుబాటులో ఉన్నాయి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్ వాడటం వంటివి చేయడం ద్వారా కోవిడ్ వేరియంట్ల నుంచి రక్షణ పొందవచ్చు. అయితే  KP.3 వేరియంట్ పై వ్యాక్సిన్ పనిచే స్తుందా అంటే.. పనిచేస్తుందంటున్నారు నిపుణులు.