- బిల్డర్లను బ్లాక్మెయిల్ చేస్తున్న ఇద్దరిపై కేసు
కూకట్పల్లి, వెలుగు: బిల్డర్లను బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరిపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ పరిసర ప్రాంతాల్లో భవనాలు నిర్మించే బిల్డర్లను బత్తిన సుమన్‌గౌడ్(40), జంగాల నాగార్జున(39) బెదిరించి బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. ఇద్దరికి చెరో రూ.లక్ష ఇవ్వాలని, రూపాయి తక్కువైనా మున్సిపల్అధికారులకు ఫిర్యాదు చేసి, బిల్డింగ్లు కూల్చివేయిస్తామని బెదిరిస్తున్నారు. లేదంటే కోర్టులో కేసులు వేసి కూల్చివేయిస్తాని బ్లాక్మెయిల్ చేస్తున్నారు.
అయితే, తాము అంత ఇచ్చుకోలేమని స్థానిక బిల్డర్ పవన్ కుమార్‌తో పాటు అతని పార్టనర్ మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా వేధింపులకు పాల్పడ్డారు. తమ గత చరిత్ర తెలుసుకుని అడిగినంత ఇవ్వాలని, ఇప్పటికే కూల్చివేయించిన లిస్ట్‌ను బిల్డర్లకు పంపి బ్లాక్మెయిల్ చేశారు. దీంతో విసిగిపోయిన పవన్‌కుమార్ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.