అఫ్గానిస్తాన్ యువ క్రికెటర్ సెడిఖుల్లా అటల్ చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్‌లో 7 సిక్సులు కొట్టి నయా రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డుకి అఫ్ఘాన్ వేదికగా జరుగుతోన్న కాబుల్ ప్రీమియర్ లీగ్ 2023(కేపీఎల్) వేదికైంది.
కాబుల్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా అబాసిన్ డిఫెండర్స్‌తో జరిగిన మ్యాచులో షాహీన్ హంటర్స్ కెప్టెన్ సెడిఖుల్లా వీరవిహారం చేశాడు. కేవలం 56 బంతుల్లోనే 7 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేశాడు. సెడిఖుల్లా ధాటికి హంటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఒకే ఓవర్‌లో 7 సిక్సులు
హంటర్స్ ఇన్నింగ్స్ అమీర్ జజాయ్ వేసిన 19వ ఓవర్‌లో సెడిఖుల్లా ఏకంగా 7 సిక్సులు బాదాడు. తొలి బంతి నోబ్+ సిక్స్ కాగా, తరువాతి 6 బంతులను 6 సిక్సులుగా మలిచాడు. ఈ ఓవర్‌లో ఏకంగా 48 పరుగులు వచ్చాయి. ఒకే ఓవర్‌లో 7 సిక్సులు బాదిన తొలి అఫ్ఘాన్ కక్రికెటర్‌గా సెడిఖుల్లా చరిత్ర సృష్టించాడు.
Sediq Atal hits 7 sixes in an over of Amir Zazi in the KPL. He conceded 4⃣8⃣ runs of a single over ??#Ashes #INDvsWI #INDvWIpic.twitter.com/Ddx6f87PkP
— Abdullah Neaz ?? (@Abdullah__Neaz) July 29, 2023
ఈ మ్యాచులో హంటర్స్ 92 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హంటర్స్ 213 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో అబాసిన్ డిఫెండర్స్ 121 పరుగులకే కుప్పకూలింది.
Sediq Atal, who recently made his T20I debut for Afghanistan, smashed seven sixes in an over in the Kabul Premier League 2023. pic.twitter.com/zUYvt9epWf
— CricTracker (@Cricketracker) July 29, 2023
ఒకే ఓవర్‌లో 7 సిక్సులు బాదిన రుతురాజ్ గైక్వాడ్
భారత క్రికెటర్లలో యువ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఈ ఘనత సాధించాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఉత్తర ప్రదేశ్ తో జరిగిన మ్యాచులో రుతురాజ్ ఈ రికార్డు సృష్టించాడు. మహారాష్ట్ర బౌలర్ రుతురాజ్ శివసింగ్ వేసిన ఒక ఓవర్ లో 7 సిక్సులు బాదాడు. ఆరు బంతులను స్టాండ్స్ వెలుపలకు కొట్టిన గైక్వాడ్.. ఆ ఓవర్ లో పడిన నోబాల్ ను స్టాండ్స్ లోకి తరలించాడు. దీంతో 7 బంతులకు 7 సిక్సులు వచ్చాయి.