వర్ధన్నపేట/ పర్వతగిరి, వెలుగు : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లందలో ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ ద్వారా లబ్ధిపొందిన మహిళా మొబైల్ టిఫిన్స్ సెంటర్‌ను కేఆర్ నాగరాజు ప్రారభించారు. మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట టీపీపీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, మండలాధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ తదితరులున్నారు.
పర్వతగిరి మండలం మాల్యాతండా (పంచరాయితండా)కు చెందిన బానోత్వినోద్కుమార్సౌత్ఏషియన్అథ్లెంటిక్ఛాంపియన్షిప్(జూ) పోటీల్లో సిల్వర్పథకం సాధించాడు. ఇందుకుగానూ వినోద్‌ను ఎమ్మెల్యే నాగరాజు సన్మానించి, అభినందించారు.