అసెంబ్లీకి పంపితే  సమస్యలు పరిష్కరిస్తా : కేఆర్‌‌‌‌ నాగరాజు

హసన్‌‌‌‌పర్తి/వర్ధన్నపేట, వెలుగు : తనను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వర్ధన్నపేట కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ కేఆర్‌‌‌‌ నాగరాజు చెప్పారు. ప్రచారంలో భాగంగా సోమవారం హసన్‌‌‌‌పర్తి, చింతగట్టు, దమ్మన్నపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆరు గ్యారంటీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో పడుకునే సీఎం కావాలో.. ప్రజా సమస్యలు పరిష్కరించే సీఎం కావాలో ప్రజలే తేల్చుకోవాలని చెప్పారు. రైతు బంధు ఇచ్చి సబ్సిడీ ఎత్తివేశారని విమర్శించారు. ఆయా కార్యక్రమాల్లో వరంగల్‌‌‌‌ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ రాజేశ్వర రావు, నియోజకవర్గ కోఆర్డినేటర్ నమ్మిండ్ల శ్రీనివాస్, కిసాన్‌‌‌‌ సెల్‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్‌‌‌‌రావు, నరకుడు వెంకటయ్య, బ్లాక్‌‌‌‌ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజిరెడ్డి, మాలతి, సునీత పాల్గొన్నారు.