WI vs BAN: వెస్టిండీస్ తరపున ఆల్‌టైం రికార్డ్ సెట్ చేసిన బ్రాత్‌వైట్

కింగ్ స్టన్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్‌వైట్ ఆల్ టైం రికార్డ్ ను ఒకటి తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా 86 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన తొలి వెస్టిండీస్ ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ గార్ఫీల్డ్ సోబర్స్‌ వరుసగా 85 టెస్ట్ మ్యాచ్ లు ఆడడం ఇప్పటివరకు అత్యధికం. సోబర్స్ 1955 నుండి 1972 వరకు వరుసగా 85 టెస్టులు ఆడి 1974 రిటైరయ్యాడు.

బంగ్లాదేశ్ తో తొలి టెస్టుకు ముందు వరుసగా 84 టెస్టులాడిన ఈ విండీస్ టెస్ట్ కెప్టెన్ ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తో సోబర్స్‌ రికార్డ్ బ్రేక్ చేశాడు. బ్రాత్‌వైట్ 2011లో వెస్టిండీస్ తరపున టెస్ట్ ఫార్మాట్ లో అరంగేట్రం చేశాడు. 2014 వరకు జట్టులోకి వస్తూ పోతూ ఉన్న బ్రాత్ వైట్.. ఈ నాలుగేళ్లలో కేవలం 10 టెస్ట్ మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. 2014 తర్వాత జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న అతను.. అప్పటి నుంచి విండీస్ తరపున ఒక్క టెస్ట్ మ్యాచ్ మిస్ అవ్వకుండా ఆడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో విండీస్ టెస్ట్ జట్టు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. 

ALSO READ : IPL 2025: అతను లేకపోతే ముంబై జట్టులో సందడే ఉండదు: హార్దిక్ పాండ్య ఎమోషనల్

బ్రాత్‌వైట్ తన 96వ టెస్టుకు ముందు మాట్లాడుతూ.. ఈ ఘనత సాధించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుత తరంలో T10, T20 క్రికెట్ ప్రభావం ఉన్నప్పటికీ వరుసగా ఇన్ని టెస్ట్ లు ఆడడం సంతోషంగా ఉందని ఈ విండీస్ కెప్టెన్ తెలిపాడు. కెరీర్ మొత్తంలో 96 టెస్టులాడిన బ్రాత్‌వైట్.. 184  ఇన్నింగ్స్ లో 5802 పరుగులు చేశాడు. వీటిలో 12 సెంచరీలు.. 30 హాఫ్ సెంచరీలు  ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న టెస్టులో 33 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.