జీతాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో వీఆర్ఏ ఆత్మహత్య

నవీపేట్, వెలుగు: ఆర్థిక ఇబ్బందులతో వీఆర్ఏ సూసైడ్ చేసుకున్నాడు. ఎస్ఐ రాజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్​జిల్లా నవీపేట మండలం బినోల గ్రామంలోని ఆశాజ్యోతి కాలనీకి చెందిన గుట్ట మీద క్రాంతికుమార్(28) బినోల గ్రామ వీఆర్ఏగా చేస్తున్నాడు. కొన్ని నెలలుగా జీతాలు రాకపోవడంతో మనస్తాపానికి గురై బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని చుట్టుపక్కలవాళ్లు గమనించి జిల్లా హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున చనిపోయాడు.