
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలంలో పవర్ జనరేషన్ ఆపేయాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను కృష్ణా బోర్డు కోరింది. కేఆర్ఎంబీ మెంబర్ (పవర్) ఎల్‌బీ.మౌన్‌తంగ్ గురువారం రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు లెటర్ రాశారు. శ్రీశైలంలో నీటిమట్టం గురువారానికి 809.9 అడుగులకు పడిపోయిందని, నీటి నిల్వ 34.24 టీఎంసీలు మాత్రమే ఉందని పేర్కొన్నారు. మే వరకు తాగునీటికోసం తెలంగాణకు 3.50 టీఎంసీలు, ఏపీకి 6 టీఎంసీలు అవసరమని ఇండెంట్ ఇచ్చాయని తెలిపారు. కానీ 5.21 టీఎంసీలే తీసుకునే అవకాశం ఉందని.. దీంతో పవర్ జనరేషన్ ఆపేయాలని ఇరు రాష్ట్రాల జెన్‌కోలను ఆదేశించాలని కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలకు అడిగినన్ని నీళ్లు ఇవ్వలేమని కేఆర్ఎంబీ ఎస్ఈ ప్రకాశ్ తేల్చి చెప్పారు. కొత్త ఇండెంట్ పెట్టాల్సిందిగా రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు లేఖ రాశారు. పవర్ జనరేషన్ స్థాయి కన్నా తక్కువే నీటి మట్టం ఉందని, ఆ నిల్వకు మించి రెండు రాష్ట్రాలు నీళ్లకు ఇండెంట్లు పెట్టాయని ఆయన అన్నారు.
మరిన్ని వార్తల కోసం..
కోఠి ఆస్పత్రిలో కోటి సమస్యలు
జీవో ఇచ్చి ఆరేండ్లయినా.. రైతులకు పరిహారం ఇయ్యరా