కాంగ్రెస్ లో చేరిన కృష్ణ చైతన్య

ఖమ్మం, వెలుగు : బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా కృష్ణ చైతన్యకు రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కృష్ణ చైతన్య మాట్లాడుతూ తనను పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.