
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెడనలో ఇవాళ జరిగే వారాహి యాత్రలో వైసీపీ నేతలు రాళ్ల దాడికి ప్లాన్ చేశారని, ఇందుకోసం రౌడీషీటర్లను కూడా అధికార వైసీపీ ఇప్పటికే దించిందని పవన్ నిన్న చేసిన వ్యాఖ్యలకు గానూ పోలీసులు నోటీసులు అందించారు. ఆరోపణలపై అధారాలుంటే చూపించాలని పోలీసులు నోటిసుల్లో పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని పోలీసులు అంటున్నారు.
కాగా జనసేనాని గత మూడు రోజులుగా కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 1న అవనిగడ్డలో బహిరంగ సభ నిర్వహించారు. రెండు రోజులు మచిలీపట్నంలో సమావేశాలు, జనవాణి నిర్వహించారు. బుధవారం పెడనలో భారీ బహిరంగ సభ తలపెట్టారు.