అల్లరి కృష్ణుడు పుట్టినరోజు పిల్లలకూ పెద్ద పండుగే. బాలకృష్ణుడు చేసిన అల్లరి ఈ పిల్లలకు తెలియాలంటేవాళ్లతో కొన్ని యాక్టివిటీస్ చేయించాలి. జన్మాష్టమిని పిల్లలతో సెలబ్రేట్ చేయడం ' ద్వారా పిల్లలకు కృష్ణుడి కథలు తెలి యడంతో పాటు, వాళ్లలో ఉన్న క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. జన్మాష్టమి రోజు పిల్లల్ని పోగుచేసి, వారికి క్రాఫ్ట్ మేకింగ్ కాంపిటీషన్ పెట్టొచ్చు. దానికంటే ముందుగా పిల్లలకు కృష్ణుడు, గోపికలు ఎలా ఉంటారో చెప్పి అలాంటి బొమ్మలు తయారుచేయించాలి.
గోవర్ధన గిరి
కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన సన్నివేశాన్ని కూడా పిల్లలతో రీక్రియేట్ చేయించొచ్చు. ఒక పెద్ద చార్జ్ తీసుకుని దానిపై పెద్దపెద్ద కొండలు గీయాలి. ఈ చార్ట్ను బ్యాక్ గ్రౌండ్లో వాడాలి. తర్వాత కింద మరో చార్ట్ ఉంచి, దానిపై కొంచెం గడ్డి వేయాలి. మధ్యలో కృష్ణుడి బొమ్మను ఉంచి దానిపై మట్టితో చేసిన గోవర్ధన గిరిని ఉంచాలి. ఈ బొమ్మల ద్వారా పిల్లలకు గోవర్ధన గిరి కథను చెప్పొచ్చు.
బృందావనం
ఈ రోజున పిల్లలతో బృందావనాన్ని రెడీ చేయిం చొచ్చు. బృందావనం ఎలా ఉంటుందో చెప్పి క్రాఫ్ట్స్ సాయంతో దాన్ని తయారుచేయమనాలి. తెల్లటి చార్ట్ మీద మట్టి పరిచి దాని పై చిన్నచిన్న మొక్కలు, గడ్డి అమర్చాలి. వాటిమధ్యలో ఒక పెద్ద మొక్క ఉంచి దాని కింద వేణువు ఊదుతు న్నకృష్ణుడి బొమ్మను ఉంచాలి. తర్వాత కృష్ణుడి చుట్టూ గోపికల బొమ్మలు, ఆవులు, జింకలు, నెమళ్ల బొమ్మలు పెట్టాలి. పిల్లలకు బృందావనం ఎంత అందంగా ఉంటుందో, కృష్ణుడు బృం దావనంలో ఏమేం చేసేవాడో కథల రూపంలో వివరించాలి.
ఉట్టిలో స్వీట్స్
ఇక చివరిగా పిల్లలకు ఇంట్లోనే ఉట్టి పోటీని పెట్టొచ్చు. ఒక మట్టి కుండను తీసుకుని అందులో స్వీట్స్, చాక్లెట్స్ ప్యాక్ చేసి పెట్టాలి. ఆ కుండకు చుట్టూ తాడుని కట్టి హైట్ అడ్జస్ట్ చేసేలా గాలిలో వేలాడదీయాలి.పిల్లలకు కృష్ణుడి వేషం వేసి, చేతికి కర్రలు ఇవ్వాలి. ఉట్టి కొట్టిన తర్వాత అందు లోనుంచి కింద పడే స్వీట్స్, చాక్లెట్స్ను పిల్లలకు పంచిపెడితే వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తారు