వాళ్లు విడిపోయారా?
టైటిల్ : #కృష్ణా రామా
డైరెక్షన్ : రాజ్ మాదిరాజు
కాస్ట్ : రాజేంద్ర ప్రసాద్, గౌతమి, శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చ రవి, జెమిని సురేశ్, రవి వర్మ
లాంగ్వేజ్ : తెలుగు
ప్లాట్ ఫాం : ఈటీవీ విన్
రామ తీర్థ (రాజేంద్ర ప్రసాద్), కృష్ణవేణి (గౌతమి) దంపతులు. ఇద్దరూ రిటైర్డ్ టీచర్స్. వాళ్లకు ముగ్గురు పిల్లలు. అందరూ విదేశాల్లో సెటిల్ అవుతారు. పిల్లల మీద బెంగతో జీవితాన్ని గడుపుతుంటారు రామ, కృష్ణ. నెలకోసారి వీడియో కాల్లో పిల్లలతో మాట్లాడతారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు మాట్లాడతామా? అని ఎదురుచూస్తుంటారు. అలాంటి వాళ్లు ప్రీతి (అనన్య శర్మ) సాయంతో ‘#కృష్ణారామా’ పేరుతో ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. అందులో వాళ్ల అభిప్రాయాలను పంచుకుంటూ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతారు. కానీ ఆ దంపతులు ఇద్దరూ విడిపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఆఖరికి సూసైడ్ వరకు వెళ్తారు! ఆ తర్వాత ఏమైంది? వాళ్లెందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సోషల్ మీడియా వల్ల పర్సనల్ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? అనేది చూపించే ప్రయత్నం చేశారు. ఎంటర్టైన్మెంట్తోపాటు ఎమోషన్ చాలా బాగా పండింది. కానీ కొన్ని చోట్ల సాగదీత అనిపిస్తుంది.
ఆ కేసు నుండి ఎలా బయటపడ్డాడు?
టైటిల్ : రెడ్ శాండిల్ వుడ్
డైరెక్షన్ : గురు రామాంజన్
కాస్ట్ : వెట్రి, గణేశ్ వెంకట్రామన్, కబాలి విశ్వనాథ్, వినోద్ సాగర్, కేజీఎఫ్ రామ్
లాంగ్వేజ్ : తమిళం
ప్లాట్ ఫాం : ఆహా
ప్రభ (వెట్రి) బాక్సర్. తన గర్ల్ ఫ్రెండ్ అన్న కరుణ (కబాలి విశ్వనాథ్)ని వెతికే పనిలో ఆంధ్ర ప్రదేశ్ అంతటా తిరగాలి అనుకుంటాడు. ఆ విషయాన్ని అక్కడి పోలీస్‌లకు ముందుగానే చెప్తాడు. ఇదిలా ఉంటే... అనుకోకుండా ప్రభ ఎర్ర చందనం స్మగ్లింగ్ కేస్‌లో నిర్దోషి అని నిరూపించుకునే క్రమంలో, తనలాంటి అమాయకులైన తమిళులు చాలామంది అక్కడ కూలీలుగా పనిచేస్తున్నట్లు తెలుసుకుంటాడు. దీనంతటి వెనక ఉన్నది కింగ్‌పిన్ హరిమర (కేజీఎఫ్ రామ్) అని తెలుస్తుంది. అతను నార్త్ మద్రాస్‌లో బాక్సర్. మరి అతన్ని దాటి ప్రభ... కరుణని ఎలా కాపాడతాడు? ఈ కేసు నుంచి ఎలా బయటపడతాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. కథ, స్క్రీన్ ప్లే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్.
థ్రిల్లింగ్ సిరీస్
టైటిల్ : దురంగా 2 (వెబ్ సిరీస్)
డైరెక్షన్ : రోహన్ సిప్పీ
కాస్ట్ : గుల్షన్ దేవయ్య, అమిత్ సాద్, ద్రష్టి ధమి, అభిజీత్ ఖండ్కేకర్, రాజేశ్ కట్టర్
లాంగ్వేజ్ : హిందీ
ప్లాట్ ఫాం : జీ 5
దురంగా మొదటి సీజన్‌కి కొనసాగింపుగా సీజన్ 2 తీశారు. మొదటి సీజన్లో మెయిన్ క్యారెక్టర్ సమ్మిత్ పటేల్ కోమాలో నుంచి బయటకు రావడంతో ముగుస్తుంది. తర్వాత ఏం చేశాడనేది.. ఈ సీజన్లో చూపించారు. అభిషేక్ బానే తన తండ్రితో పాటు పనిచేసే వ్యక్తి కోసం వెతుకుతుంటాడు. అప్పుడే అతనికి సమ్మిత్ ఎదురవుతాడు. వాళ్లిద్దరి గుర్తింపు వెనుక ఉన్న అసలు నిజాలు, వాళ్ల గతం గురించి ఈ సీజన్లో చూపించే ప్రయత్నం చేశారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు. ప్రతి ఎపిసోడ్ ప్రేక్షకుల్లో టెన్షన్ క్రియేట్ చేస్తుంది. సమ్మిత్ పటేల్ (అమిత్‌సాద్) వాళ్ల అమ్మానాన్నలు డాక్టర్ మనోహర్ పటేల్ (రాజేశ్ కట్టర్), అనుప్రియ (దివ్య సేత్). వాళ్లు కొడుకుని కాపాడుకోవడానికి నానా తంటాలు పడతారు. అదే టైంలో అభిషేక్ బానే (గుల్షన్ దేవయ్య), తన తండ్రితోపాటు కలిసి పనిచేసే వ్యక్తిని వెతకడానికి బయల్దేరతాడు. అలాగే అతని భార్య ఐరా పటేల్ (ద్రష్టి ధమి) మర్డర్స్ వెనక ఉన్న అసలు దోషుల్ని పట్టుకునే ప్రయత్నంలో ఉంటుంది. ఈ సిరీస్‌లో ఫ్లాష్ బ్యాక్ చూపించి, తర్వాత ఏం జరుగుతుందో ఊహించమని ఆడియెన్స్‌కి వదిలేశారు. ఈ సిరీస్ కొరియన్ డ్రామా ‘ఫ్లవర్ ఆఫ్ ఎవిల్’కి రీమేక్ అనే విషయం తెలిసిందే.