ఆ ప్రాజెక్టుల డీపీఆర్ ఇవ్వాలని ఏపీకి కృష్ణా బోర్డు లేఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన తెలుగు గంగ విస్తరణ, వెలిగొండ ప్రాజెక్టుల డీపీఆర్ లు వెంటనే తనకు సమర్పించాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏపీవి అక్రమ ప్రాజెక్టులు అంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదు ప్రతిని జత చేస్తూ ఏపీ ప్రభుత్వానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి రాయిపురే లేఖ పంపారు. 
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ  ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా తెలుగు గంగ విస్తరణ, వెలిగొండ ప్రాజెక్టులను చేపట్టిందని తెలంగాణ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను వెంటనే అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన కేఆర్ఎంబీ వివరణ కోరుతూ ఏపీకి లేఖ రాసింది. అంతేకాదు తెలంగాణ చెబుతున్న ఈ రెండు అక్రమ ప్రాజెక్టుల డీపీఆర్ లు సమర్పించాలని స్పష్టం చేసింది.