కృష్ణమ్మ వస్తోంది.. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల వివరాలిలా..

ఎగువన నుంచి కృష్ణా ప్రాజెక్టులకు భారీ వరద కొనసాగుతోంది. ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది. జూరాల జలాశయం నుంచి శ్రీశైలానికి లక్షా 92 వేల  803 క్యూసెక్కుల వరద చేరుతోంది. శ్రీశైలం డ్యామ్  పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా...ప్రస్తుత నీటి మట్టం 853 అడుగులకు చేరుకుంది.  పూర్తిస్థాయి నీటి నిల్వ 215 TMC లు కాగా...ప్రస్తుతం నీటి నిల్వ 87  TMC లుగా ఉంది. ఎడమ జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి మొదలు పెట్టారు అధికారులు.

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కూడా వరద కొనసాగుతోంది. 9500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వరద జలాశయంలోకి వస్తుంది. పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం   312.5050 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 503.80 అడుగుల్లో 121.3844 టీఎంసీల నీరు ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం సామర్థ్యం 590 అడుగులు..