- ఉత్తర్వులు జారీ చేసిన కేఆర్ఎంబీ
హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్‌నుంచి ఏపీకి నీటిని విడుదల చేయాలని కృష్ణా రివర్‌మేనేజ్‌మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) ఆదేశాలిచ్చింది. సాగర్ఎడమకాల్వ జోన్–3లోని ఏపీ ఆయకట్టుకు 12 టీఎంసీల జలాలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జోన్‌లోని ఆయకట్టుకు ఇప్పటికే ఏపీ 9.55 టీఎంసీలను వినియోగించుకోగా.. మళ్లీ బోర్డు నీటిని విడుదల చేయనుంది.
తమకు డిసెంబర్ 1 నుంచి 31 వరకు15.86 టీఎంసీలు అవసరమని, జలాలు విడుదల చేయాలని బోర్డుకు ఏపీ సర్కారు విజ్ఞప్తి చేసింది. ఏపీ విజ్ఞప్తిని మన్నించిన కేఆర్ఎంబీ.. అందుబాటులో ఉన్న నీటినిల్వలు, ఇప్పటివరకు చేసిన వినియోగాలను పరిగణనలోకి తీసుకుని రోజుకు 3,059 క్యూసెక్కుల చొప్పున 12 టీఎంసీల జలాలను విడుదల చేయాలని నిర్ణయించింది.