న్యూఢిల్లీ : ఇండియా యంగ్ బాక్సర్ కృష్ణవర్మ అండర్19 వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్‌తో మెరిసింది. మరో ఐదుగురు బాక్సర్లు సిల్వర్ మెడల్స్ రాబట్టారు. అమెరికాలోని కొలొరాడోలో శనివారం జరిగిన విమెన్స్ 75 కేజీ ఫైనల్లో కృష్ణవర్మ 5–0తో జర్మనీ బాక్సర్ సిమోన్ లెరికాను చిత్తు చేసింది.
విమెన్స్ 48 కేజీ ఫైన్లలో చంచల్ చౌదరి డిస్‌క్వాలిఫై అయి సిల్వర్‌తో సరిపెట్టగా.. 57 కేజీ టైటిల్ ఫైట్‌లో అంజలి కుమారి 0–5తో మియా ఐటోన్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయింది. విని (60 కేజీ), ఆకాంక్ష (70 కేజీ)తో పాటు రాహుల్ కుండు (మెన్స్ 75 కేజీ) తమ ఫైనల్ బౌట్స్‌లో ఓడి రజతాలతో తిరిగొచ్చారు.