సిటీలో 2రోజులు కృష్ణా నీటి సరఫరా బంద్

సిటీలో 2రోజులు కృష్ణా నీటి సరఫరా బంద్

హైదరాబాద్, వెలుగు: కృష్ణా పైపు లైన్ విస్తరణ పనులతో సిటీలో పలు చోట్ల వాటర్ సప్లయ్ నిలిచిపోనుంది. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6  గంటల వరకు బంద్​ చేస్తారు. చాంద్రాయణగుట్ట నుంచి కందికల్ గేట్ క్రాస్ రోడ్డు వరకు పైపులైన్​ను విస్తరిస్తున్నట్లుగా వాటర్ ​బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఓ అండ్​ఎం డివిజ‌‌‌‌న్ నం.1, 2 ప‌‌‌‌రిధిలోని మీరాలం రిజ‌‌‌‌ర్వాయ‌‌‌‌ర్, కిష‌‌‌‌న్ బాగ్. ఆల్ జుబైల్ కాల‌‌‌‌నీ, అలియాబాద్ రిజ‌‌‌‌ర్వాయ‌‌‌‌ర్, బాలాపూర్ రిజ‌‌‌‌ర్వాయ‌‌‌‌ర్ ప్రాంతాల్లో బ్రేక్ డౌన్ అవుతుందని పేర్కొంది.