టీజీఓ హైదరాబాద్​అధ్యక్షుడిగా కృష్ణయాదవ్

టీజీఓ హైదరాబాద్​అధ్యక్షుడిగా కృష్ణయాదవ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీజీఓ) హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఎం.బి. కృష్ణయాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సమక్షంలో నాంపల్లిలోని టీజీఓ భవనంలో శనివారం ఎన్నికలు నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా సహ అధ్యక్షుడిగా ఆశన్న, కార్యదర్శిగా మహ్మద్ అబ్దుల్ ఖాదర్, ఉపాధ్యకులుగా డా.ఎన్.సురేందర్, రాజేందర్,  ఎంజులారెడ్డి, సహకార్యదర్శులుగా మహ్మద్ గౌస్, శ్రీరామ్, డా.సునీతదోషి, కోశాధికారిగా ఎం.వి.రమణ ఎన్నికయ్యారు.