ఇష్టం లేకనే బీఆర్ఎస్ ను వీడా: మాజీ మంత్రి కృష్ణ యాదవ్

ఆత్మగౌరవం లేని పార్టీలో కొనసాగడం ఇష్టం లేకనే  బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ తెలిపారు.  సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా  తీవ్ర నిరాశను కల్గించిందన్నారు. 2018 నుంచి  పార్టీలో ఉన్న తగిన ప్రాధాన్యత లభించలేదన్నారు. బీఆర్ఎస్  బీసీ వ్యతిరేక పార్టీ అని అన్నారు. బీఆర్ఎస్ కు  రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.  

ఇటీవల కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ జాబితాలో కృష్ణ యాదవ్ పేరు లేకపోవడంతో ఆయన  అసంతృప్తితో ఈ నిర్ణయం  తీసుకున్నారు. త్వరలో  కృష్ణ యాదవ్ బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

వచ్చే ఎన్నికల్లో కృష్ణ యాదవ్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అంబర్ పేట, లేదా, మలక్ పేట టికెట్ ను అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేసీఆర్  మలక్ పేట  టికెట్  తీగల అజిత్ రెడ్డికి, అంబర్ పేట  టికెట్  కాలేరు వెంకటేశ్ కు ఇచ్చారు.