
- మందమర్రి ఏరియా జీఎం దేవేందర్
కోల్‌బెల్ట్, వెలుగు : మందమర్రి ఏరియా గనులు జనవరి నెలలో 91శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించాయని ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్శనివారం ప్రకటనలో తెలిపారు. నాలుగు అండర్ గ్రౌండ్ మైన్లు, రెండు ఓసీపీల్లో 2.88 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్‌కు గానూ నెలఖారునాటికి 91శాతంతో 2,61,674 టన్నులు సాధించాయన్నారు. ఏరియాలోని రామకృష్ణాపూర్ఓపెన్ కాస్ట్ మైన్‌లో 35 వేల టన్నులకు గాను 299 శాతంతో 1,04,524 టన్నులు, కేకే5 గనిలో 17 వేల టన్నులకు 116 శాతంతో 19,775 టన్నులు సాధించి ఏరియా గనులకు ఆదర్శంగా నిలిచాయన్నారు.
ఇందుకు గనుల ఉద్యోగులు, కార్మికులు, సూపర్వైజర్లు, ఆపరేటర్లు, ఆఫీసర్ల సమష్టి కృషి కారణమని అభినందించారు. కాసిపేట గనిలో 64శాతం, కాసిపేట-2 గనిలో 69, శాంతిఖని గనిలో 45, కేకే ఓసీపీలో 57శాతం ఉత్పత్తి వచ్చిందన్నారు. 2024-25 వార్షిక సంవత్సరం ఏప్రిల్‌నుంచి జనవరి వరకు ఏరియాలోని గనుల్లో 29,85,000 టన్నుల బొగ్గు టార్గెట్‌కు గాను 75 శాతంతో 22,43,834 టన్నులు సాధించిందన్నారు.
ఓబీ (మట్టి) తొలగింపు జనవరిలో ఆర్కేపీ ఓసీపీ, కేకే ఓసీపీల్లో 14.11 లక్షల క్యూబిక్ మీటర్లు వెలికితీసినట్లు చెప్పారు. ఇది గడిచిన డిసెంబర్-2024తో పోల్చితే 2.62 లక్షల క్యూబిక్ మీటర్లు అధికమన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అందరూ కృషి చేయాలని జీఎం కోరారు.