27 నుంచి యాదగిరి గుట్టలో కృష్ణాష్టమి వేడుకలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 27 నుంచి 29 వరకు శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఈవో భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీవైష్ణవ పాంచరాత్ర ఆగమశాస్త్ర పద్ధతుల్లో మూడు రోజులపాటు వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

 29న సాయంత్రం 5 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఉట్లు కొట్టే కార్యక్రమం, రాత్రి 8 గంటలకు రుక్మిణీ కల్యాణం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఆర్జిత సేవలైన నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హోమం, భోగాలు 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు తాత్కాలికంగా రద్దు చేయనున్నట్లు ఈవో తెలిపారు.