క్యాలండర్ ప్రకారం ఎనిమిదో నెల (శ్రావణ మాసం) ఎనిమిదో (అష్టమి) రోజు విష్ణుమూర్తే స్వయంగా కన్నయ్యగా పుట్టాడు. గోకులంలో గోపాలుడిగా అల్లరి చేసి మురిపించాడు. వెన్నతో పాటు. గోపికల మనసును దొంగిలించాడు. రాధా కృష్ణుడిగా అసలు సిసలు ప్రేమ ఎలా ఉంటుందో నిరూపించాడు.
మనిషి ధర్మంగా ఎలా జీవించాలో.. గీతలో జ్ఞానోదయం కలిగించాడు. ఇన్ని లీలలు ఒక్కడిలో ఉన్నాయి. కాబట్టే..ఒక అష్టమి ఆయన పేరు పెట్టుకుంది. అందుకే నల్లనయ్యను 'యూనివర్సల్ ఫ్రెండ్' అని కూడా అంటారు. అందుకే, ఈ బేబీ కృష్ణుడికి యుగయుగాలుగా పుట్టిన రోజు జరుపుతున్నారు. ఇంట్లో తమ పిల్లల్ని ముస్తాబు చేసి.. వాళ్లలో బాలకృష్ణుడిని చూసుకుంటున్నారు. ముగ్గులు వేసి.. వెన్న తినిపించి ఆ అల్లరికి స్వాగతం చెప్తున్నారు!
కృష్ణుడు కారణజన్ముడు . పాపాలతో పండిపోయిన తన మేనమామ కంసుడిని చంపడానికి శ్రీమహావిష్ణువే కృష్ణుడిగా జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం మధుర సామ్రాజ్యానికి ఉగ్రసేన అనే రాజు ఉండేవాడు. అతని కొడుకే కంసుడు. ఆయనే మధురకు యువరాజు కంసుడు కరుణ, జాలీ లేరి కఠినాత్ము డు. అతని క్రూరత్వం చూసి మధురలో అంతా భయపడేవారు. అయితే, ఈ భూమ్మీద కంసుడు ప్రేమించే ఏకైక వ్యక్తి ఒకరున్నారు. ఆమె అతని చెల్లెలు దేవకికి ఆమె కంసుడిలా కాదు భక్తి, ప్రేమ లెక్కువుగా ఉండేవి.
కొన్నాళ్లకు వసుదేవుడికి, దేవకికి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. స్వయంగా కంసుడే ఆ కొత్త జంటను అత్తగారింటికి తీసుకొని గుర్రపు బండిలో బయలుదేరుతాడు. అయితే, దారి మధ్యలో అకస్మాత్తుగా గాలిదుమారం లేస్తుంది. వెంటనే ఓ కంసా, ఎందుకంత సంతోషంగా ఉన్నావు? నీ ప్రియమైన చెల్లెలు ఒక కొడుకుకి జన్మనివ్వబోతోంది. ఆమె ఎనిమిదో కుమారుడే నిన్ను నాశనం చేస్తాడు. జాగ్రత్త!" అని ఆకాశవాణి వినిపిస్తుంది. అది వినగానే కంసుడి కోపం కట్టలు తెంచుకుంటుంది. నిన్నిప్పుడే చంపేస్తా ఇక... ఎనిమిదో కొడుకు ఎలా పుడతాడో చూస్తా" అని దేవకి మెడపై కత్తి పెడతాడు. 'కంసా నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా? పెళ్లి రోజే నీ చెల్లిని చంపడం న్యాయం కాదు. మాకు పుట్టిన ప్రతీ బిడ్డను నీకే అప్పగిస్తాను. నీకు మాటిస్తున్న నన్ను నమ్మి దేవకిని క్షమించు' అనడుగుతాడు వసుదేవుడు. దానికి సరేనంటాడు కంసుడు తర్వాత వసుదేవు డ్ని దేవకిని మధురకు తీసుకొచ్చి జైల్లో బంధిస్తా రు.
దేవకి కొడుకుకి జన్మనిచ్చిందని తెలియగానే. వెంటనే వెళ్లి దేవకి దగ్గర పిల్లాడిని నేలకు కొట్టి చంపేస్తాడు కంసుడు. అలాగే, వరుసగా మరో ఐదుగుర్ని పుట్టగానే చంపేస్తారు. ఏడో సారి గర్భం దాల్చినప్పుడు మాత్రం ఒక మెరుపు లాంటి అద్భుత శక్తి వచ్చి ఆ గర్భంలో ఉన్న శిశువుని తీసుకెళ్లి.. గోకులంలో ఉన్న వసుదేవుడి మరో భార్య ....రోహిణి గర్భంలో పడేస్తుంది. తర్వాత అతనే బలరాముడిగా పుడతాడు. అందుకే దేవకి ఏదో కొడుకు ప్రాణం లేకుండా పుడతాడు .
ఎనిమిదో పుత్రుడు..
అది ఎనిమిదో నెల శ్రావణ మాసంలో ఎనిమిదో రోజు. ఆరోజు భయంకరమైన ఉరుములు మెరుపు లతో మధురలో వర్షం కురుస్తుంది. అకస్మాత్తుగా ఆ జైలు గదిలో విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. మీ కోరిక నెరవేరుతుంది. నేను మీ కుమారుడిగా పుడుతున్నాను. వాసుదేవా! ఈ పిల్లాడ్ని తీసుకొని గోకులంలో సందగోపాలుడి ఇంట్లోవదులు అని మాయమవుతాడు. ఆరోజు అర్థరాత్రి దేవకి నల్ల నయ్య కృష్ణుడికి జన్మనిస్తుంది. పిల్టాడు పుట్టగానే కాపలా కాస్తున్న భటులంతా మూర్చపోతారు.
అప్పుడు వసుదేపుడు అపిల్లాడ్ని గంపలో పెట్టుకుని యమున నదీ తీరానికి చేరుకుంటాడు. ఆ నది అతనికి దారినిస్తుంది. వసుదేవుడు సందగోపాలుడి ఇంటికి వెళ్లేసరికి యశోద ఒక ఆడ పిల్లకు జన్మనిచ్చి ఉంటుంది. ఆమెకు మెలకువ రాకముందే.. ఆ ఆడపిల్ల ప్లేస్ లో కన్నయ్యను వదిలి ఆ చిన్నారిని తీసుకుని తిరిగి జైలుకు వస్తాడు. భటులు మూర్చ నుంచి తేరుకుంటారు. పసిపిల్ల ఎడుపులు దీని వెళ్లి కంసుడికి చెప్తారు. అతను వెళ్లి పసిపాపను చంపబోతుండగా..ఒక ఆడపిల్ల నీలాంటి వీరుడ్ని ఎలా చంపగలరు?' అని అంటాడు వసుదేవుడు. అయిన వాళ్ల మాట వినకుండా చంపబోతుండగా.. ఆమె చేతిలోంచి మెరుపులా దుర్గామాతగా ప్రత్యక్షమవుతుంది. 'పసిపిల్లను చంపుతావా? అర్ధరాత్రే దేవకికి కొడుకు పుట్టాడు.
గోకులంలో సురక్షితంగా ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చి... నీ పాపాలన్నింటికి శిక్ష వేస్తాడు' అని దుర్గామాత మాయమవుతుంది. అప్పటి నుంచి కంనుడే గుండెలో భయం మొదలవుతుంది. తర్వాత గోకులంలోని యశోద కుమారుడిగా కృష్ణుడి అల్లరినిపురాణాల్లో చదివినా... విన్నా.. మనసు పులకించిపోతుంది. అంత సంతోషకరమైన బాల్యం దేవునికి సాధ్యం కదా! వెన్న దోచుకుంటాడు. గోపికల మనసు దోచుకుంటారు....కంసుడు పంపే రాక్షసులతో ఆడుకుంటాడు....చివరకు కంసుడిని చంపేస్తాడు!
ఉట్టి కొడదాం!
కృష్ణాష్టమి రోజు దేశంలో ఉన్న ఆలయాలన్నీ ముఖ్యంగా మధురబృందావనాల్లో ఉన్న నాలుగువందల ఆలయాలు." శ్రీ కృష్ణ గోపందంభజేహం నామస్మరణతో మోగిపోతాయి. .. రారా.. కన్నయ్య.... నందలాలా" అనిభజన సంకీర్తనలతో, భక్తులు ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి ఉత్సాహంగా పాటలు పాడతారు. నల్లనయ్యకోసం ఇంటి ముందు ముగ్గులు వేసి, తమ పిల్లల్ని చిన్ని కృష్ణుడిగా ముస్తాబు చేసుకొని మురిసిపోతారు ప్రపంచవ్యాప్తంగా దహీ అండీ' కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దీన్నే మన దగ్గర ఉట్టి కొట్టడం'అంటారు. ఈ ఉట్టిలో వెన్న, పెరుగు ఉంటుంది. కృష్ణుడు చిన్నతనంలో చేసిన చిలిపి పనుల్లోఉట్టి మీద వెన్న దొంగిలించడం అందరికీ ఇష్టమైన ఘట్టం. దీని ప్రేరణతోనే ప్రతి గల్లీలో ఉట్టి కొడతారు.
వరల్డ్ వైడ్ పూజలు..
కృష్ణాష్టమి రోజు ప్రపంచవ్యాప్తంగా కృష్ణుడికి పూజలు, వేడుకలు జరుగుతాయి. పాకిస్తాన్ మలేసియా, బంగ్లాదేశ్ ల్లో కృష్ణుడి ఊరేగిం పులు జరుగుతాయి. కరాచీలోని శ్రీ నారాయణ్ మందిరంలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయి. బంగ్లాదేశ్ లో డాకేశ్వరి ఆలయంలో కృష్ణుడి ఊరేగింపు ఉంటుంది. మలేసియాలోని కౌలాంపూర్లో ఉన్న కృష్ణాలయం, మురుగన్ ఆలయంతో పాటు కెనడాలోని టొరంటో, రిచ్ మన్ లో కూడా ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. న్యూ జెర్సీ, కాలిఫోర్నియా, టెక్సాస్, సౌతాఫ్రి కా, రష్యాలో కూడా ఇస్కాన్ వాళ్లు వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుతారు. నేపాల్లోని కృష్ణుడి ఆలయంలో పూలు, సిడ్కా( నాణేలు) నైవేద్యంగా అందించడం. ఆనవాయితీ. అలా చేస్తే ఆరోగ్యం. డబ్బు లభిస్తుందని వాళ్ల నమ్మకం. ఒడిశాలో జరుపుకున్నట్టుగానే.. పారిస్ లో అర్దరాత్రి వరకు ఉపవాసం ఉండి పొద్దున్నే చిన్ని కృష్ణుడి విగ్రహాలకు అభిషేకం చేస్తారు..
తిరుమలలో గోకులాష్టమి
ద్వాపరయుగంలో గోవులు కాచిన గోపాలుడే కలియుగంలో గోవిందుడిగా పూజలందుకుంటు న్నట్టు శ్రీవేంకటేశ్వర మహాత్యం చెపోంది. అందుకే గోకులాష్టమి వేడుకలు తిరుమలలో వైభవంగా జరుగుతాయి. శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసమూర్తిని బంగారు వాకిలి ముందున్న తిరుమాణి మండపంలో స్నానపీఠంపై వేంచేపు చేస్తారు. మరో పీఠంపై శ్రీకృష్ణుడిని కూడా తూర్పు ముఖంగా వేంచేపు చేసి, తిరుమంజనం (అభిషేకం) చేస్తారు.
సుప్రభాతం, కొలువు, తోమాలసేవ తర్వాత శ్రీకృష్ణుడిని బంగారు వాకిలి దగ్గర వేంచేపు చేసి నువ్వుల నూనెతో తలంటుతారు. దీన్నే 'తైలకావు సమర్పణ' అంటారు. అప్పుడే పుట్టిన బాలకృష్ణుని సన్నిధి వీధి నుంచి హండు మఠం, దక్షిణ, పడమర, ఉత్తర, తూర్పు మాడ వీధి మీదుగా మహా ప్రదక్షిణ మార్గంలో ఊరేగిస్తుండగా.. శ్రీకృష్ణునికి తైలకావు చెయ్యగా మిగిలిన పురిటి తైలాన్ని నాలుగు
మాడ వీధుల్లో భక్తులకు పంచుతారు.