తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘కస్టడీ’ కృతి శెట్టికి ఆశించిన సక్సెస్ ఇవ్వలేదు. దీంతో ఆమె నెక్ట్స్ సినిమాపై సస్పెన్స్ నెలకొంది. తాజాగా దర్శకుడు వెంకట్ ప్రభు ఆమెకు రెండో ఛాన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడట. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌తో ఈ డైరెక్టర్ ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ ‘లియో’ షూటింగ్‌ను ముగించే పనిలో ఉన్నాడు.
ఇది పూర్తవ్వగానే కొత్త సినిమాకు కొబ్బరికాయ కొడతారట. ఇందులో ఫీమేల్ లీడ్ కోసం కళ్యాణి ప్రియదర్శిని, నయన తార, మృణాల్ ఠాకూర్ వంటి హీరోయిన్లు లిస్ట్ లో ఉన్నారు. అయితే, విజయ్ మాత్రం కృతి శెట్టి వైపే ఇంట్రస్ట్ చూపుతున్నాడని సమాచారం. ఈ సినిమా ఓకే అయితే, బేబమ్మకి పర్ఫామెన్స్ కు మంచి స్కోప్ దొరికినట్టే. వచ్చే నెల 22న సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు.