ఉప్పెన సినిమాతో టాలీవుడ్ హీరో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది లేటెస్ట్ బ్యూటీ కృతి శెట్టి. వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ ఒక్క హిట్టుతో వరుస అవకాశాలు అందుకున్న కృతి.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్స్ లిస్టులోకి చేరింది. కానీ, ఉప్పెన తరువాత ఆమె చేసిన ఏ ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. నాగ చైతన్యతో చేసిన కస్టడీ తరువాత ఇప్పటివరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు కృతి.
Also Read:పిల్లల్ని పెంచడం అంత ఈజీ కాదు.. ఆసక్తిరేపుతున్న మనమే మూవీ ట్రైలర్
ఈ సినిమా విడుదలై దాదాపు సంవత్సరం అవుతోంది. ఇదిలా ఉంటే.. చాలా గ్యాప్ తరువాత ఆమె తెలుగులో చేస్తున్న లేటెస్ట్ మూవీ మనమే. శర్వానంద్ హీరోగా వస్తున్న ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 7న థియేటర్స్ లోకి రానుంది. ఇందులో భాగంగా తాజాగా మనమే మూవీ ట్రైలర్ విడుదల ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ లో కృతి తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. ఇక్కడ చాలా మంది నేను గ్యాప్ ఎందుకు ఇచ్చాను అని అడుగుతున్నారు. నేను గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది. అది ప్లాన్ చేసింది కాదు.
కొంత కాలంగా వరుసగా తమిళ్, మలయాళ సినిమాలు చేతుండటంతో అక్కడే బిజీ ఐపోయాను. ఈ సంవత్సరం నేను ఐదు సినిమాలు చేస్తున్నాను. అది నేను గొప్పగా చెప్పడంలేదు. మనసుకు నచ్చే సినిమా ఒక్కటి చేసినా నాకు సంతోషమే.. అంటూ చెప్పుకొచ్చింది కృతి. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.